Arjun, with his tally of 18 wickets from five Cooch Behar Trophy (National U-19) games, is 43rd in the list of wicket-takers for the season. He had one five-wicket haul (5/95) against MP.
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ భారత అండర్-19 జట్టుకి ఎంపికయ్యాడు. జులైలో శ్రీలంక పర్యటనకు వెళ్తున్న భారత అండర్-19 జట్టులో అర్జున్ టెండూల్కర్‌కి చోటు దక్కించుకున్నాడు. ఈ పర్యటనలో భాగంగా శ్రీలంకతో టీమిండియా రెండు నాలుగు రోజుల మ్యాచ్‌లు, ఐదు వన్డేలు ఆడనుంది.
18 ఏళ్ల అర్జున్ టెండూల్కర్ ప్రస్తుతం ఆల్‌రౌండర్‌గా రాణిస్తున్నాడు. ఈ పర్యటనలో అర్జున్ టెండూల్కర్ రెండు నాలుగు రోజుల మ్యాచ్‌లకి ఎంపికయ్యాడు. నాలుగు రోజుల మ్యాచ్‌ల్లో అర్జున్ ప్రధాన ఆటగాడు కావడంతో అతడికి చోటు లభించింది. అయితే, వన్డే జట్టులో మాత్రం అతడికి చోటు కల్పించలేదు.
కాగా, నాలుగు రోజుల మ్యాచ్ జట్టుకి ఢిల్లీ వికెట్ కీపర్ అనుజ్ రావత్ సారథ్యం వహించినున్నాడు. అర్జున్ అండర్-19 క్రికెటర్ల కోర్ గ్రూప్‌లో సభ్యుడు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ ఉనాలోని జోనల్ క్రికెట్ అకాడమీ (జెడ్‌సీఏ)లో ఏర్పాటుచేసిన క్యాంపులోని ప్రధాన అండర్-19 ఆటగాళ్లలో ఒకడిగా అర్జున్ ప్రస్తుతం శిక్షణ పొందుతున్నాడు.