టీవీఎస్ మోటార్స్ భారతదేశపు మొట్టమొదటి హైబ్రిడ్ స్కూటర్ టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube Hybrid)ను విడుదలకు సిద్దం చేస్తోంది. తాజాగా అందిన సమాచారం మేరకు, టీవీఎస్ మోటార్ కంపెనీ ఈ ఏడాదిలోనే ఐక్యూబ్ హైబ్రిడ్ స్కూటర్‌ను విడుదల చేయనున్నట్లు తెలిసింది.
టీవీఎస్ ఐక్యూబ్ స్కూటర్‌ను చివరిసారిగా 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పోలో ఆవిష్కరించింది. ఈ స్కూటర్‌లో సాంకేతికంగా 100సీసీ పెట్రోల్ ఇంజన్ మరియు ఎలక్ట్రిక్ మోటార్ అనుసంధానం ఉంది. 150Wh మరియు 500Wh సామర్థ్యం ఉన్న రెండు బ్యాటరీ ఆప్షన్‌లతో లభిస్తుంది.
స్కూటర్‌లో ఎలక్ట్రిక్ మోటార్ పనితీరును ఎకానిమీ మరియు పవర్ అనే రెండు రైడింగ్ మోడ్స్ పర్యవేక్షిస్తాయి. గంటకు 20 కిలోమీటర్ల కంటే తక్కువ వేగం ఉన్నపుడు కేవలం ఎలక్ట్రిక్ పవర్‌తో మాత్రమే నడుస్తుంది. దీని కంటే ఎక్కువ వేగంతో వెళితే పెట్రోల్ ఇంజన్‌తో నడుస్తుంది.
Read more at: https://telugu.drivespark.com/two-wheelers/2018/tvs-electric-scooter-iqube-hybrid-2018-india-launch-country-first/articlecontent-pf77409-012157.html
#TVS #TVSHybrid #TVSElectric
Source: https://telugu.drivespark.com/