డుకాటి ఇండియా విపణిలోకి సరికొత్త మోన్‌స్టర్ 797+ బైకును లాంచ్ చేసింది. డుకాటి మోన్‌స్టర్ 797+ బైకు నిజానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న 797 యొక్క అప్‌డేటెడ్ వెర్షన్. అయితే, అప్‌డేటెడ్ వెర్షన్ అదే మునుపటి స్టాండర్డ్ వెర్షన్ ధరలోనే వచ్చింది. డుకాటి మోన్‌స్టర్ 797+ ప్రారంభ ధర రూ. 8.03 లక్షలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉంది.
డుకాటి మోన్‌స్టర్ 797+ చూడటానికి అచ్చం స్టాండర్డ్ 797 మోడల్‌నే పోలి ఉంటుంది. అయితే, 797+ బైకులో ఫ్రంట్ ఫెయిరింగ్ మరియు రియర్ ప్యాసింజర్ సీట్ కవర్ ఉన్నాయి. రెండు ఫీచర్లు కూడా బాడీ కలర్ మ్యాచింగ్‌తో వచ్చాయి.
మోన్‌స్టర్ మోడల్‌ను ప్రపంచ విపణిలోకి ప్రవేశపెట్టి 25 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని డుకాటి ఈ మోన్‌స్టర్ 797+ బైకును లాంచ్ చేసింది. డుకాటి ఇండియా లైనప్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న బైకులు మోన్‌స్టర్ సిరీస్.
Read more at: https://telugu.drivespark.com/two-wheelers/2018/ducati-797-plus-monster-india-launch-price-rs-8-03-lakh-monster-821-deliveries-start/articlecontent-pf77435-012160.html
#Ducati #DucatiMonster797