టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇచ్చిన ఫిట్‌నెస్ ఛాలెంజ్‌ను స్వీకరించిన ప్రధాని నరేంద్ర మోడీ ఓ ఫిట్‌నెస్ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఉదయం వేళ యోగా చేస్తూ.. ప్రకృతిలో ఉండే పంచతత్వాలతో తాను ప్రేరణ పొందానని మోడీ వ్యాఖ్యానించారు. రోజూ ఇలా చేయడం ద్వారా రీఫ్రెష్‌గా, ఉత్సాహంగా ఉంటుందని, శ్వాసకు సంబంధించి ప్రాణాయామం చేస్తానంటూ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. మనం ఫిట్‌గా ఉంటేనే ఇండియా ఫిట్‌గా ఉంటుందన్నారు.