Tamil Film Industry Boycotts Filmfare Awards

Filmibeat Telugu 2018-06-18

Views 1.2K

Kollywood audience were in surprise when they realised that not many from Tamil films were attending the Jio 65th Filmfare Awards.

సినిమా స్టార్స్ ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డుల్లో ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్‌ను ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇటీవల హైదరాబాద్‌లో 65వ సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల వేడుక వైభవంగా జరిగింది. ఈ వేడుకకు తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు స్టార్స్ హాజరైనప్పటికీ.... తమిళం నుండి పెద్ద స్టార్స్ మాత్రం రాలేదు. కొందరు చిన్న స్టార్స్ మాత్రమే ఈ అవార్డుల వేడుకలో పాల్గొన్నారు. అయితే వీరు ఈ వేడుకకు హాజరు కాకపోవడానికి గల కారణం ఏమిటో తెలిసి పోయింది. డబ్బు ఇవ్వక పోవడం వల్లనే వారంతా ఫిల్మ్ ఫేర్ వేడుకను బాయ్‌కాట్ చేశారని ప్రచారం జరుగుతోంది.
గతంలో సినిమా రంగానికి సంబంధించి ఫంక్షన్లు, అవార్డ్స్ సెర్మనీలు, డాన్స్ ప్రోగ్రామ్స్, టెలివిజన్ ప్రోగ్రామ్స్ జరిగినపుడు నటులంతా పాల్గొనేవారు. అయితే ఈ మధ్య కాలంలో ఇలాంటి కార్యక్రమాలన్నీ కమర్షియల్ అయిపోయాయి. భారీగా డబ్బు సంపాదనే లక్ష్యంగా ఆయా ఆర్గనైజేషన్స్ ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. అవి కమర్షియల్ అయ్యాయి కాబట్టే.... తమిళ సినీ నటుల సంఘం కూడా అభివృద్ధి పనులు కోసమని భారీ మొత్తం డొనేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

Share This Video


Download

  
Report form