suspense on Andhra Pradesh Minister Ganta Srinivas Rao joining in Chandrababu Naidu's Vishakapatnam tour.
#chandrababunaidu
#AndhraPradesh
అధిష్టానంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న మంత్రి గంటా శ్రీనివాస రావుకు మంత్రి నారాయణ, ఉప ముఖ్యమంత్రి చినరాజప్పలు బుజ్జగింపు ప్రయత్నాలు చేశారు. గంటా అసంతృప్తి విషయం తెలిసిన ఏపీ సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు. ఆయనతో మాట్లాడాలని సూచించారు. దీంతో వారు గంటాతో ఫోన్లో మాట్లాడారు. స్వయంగా చంద్రబాబు కూడా ఫోన్ చేశారని తెలుస్తోంది.
బుజ్జగింపులు విజయవంతమైతే నేడు ఆయన ముఖ్యమంత్రి విశాఖ పర్యటనలో పాల్గొంటారు. లేదంటే మాత్రం దూరంగానే ఉండే అవకాశముంది. చంద్రబాబు పర్యటనలో ఆయన పాల్గొనే విషయంలో ఇప్పటికీ సందిగ్ధత నెలకొంది.
గంటా మంగళవారం నాటి కేబినెట్ భేటీకి గైర్హాజరైన విషయం తెలిసిందే. అయితే, విశాఖపట్నం, భీమిలిల్లో గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొనే కార్యక్రమాలకు హాజరవనున్నట్లు టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. సీఎంతోను భేటీ అయ్యే అవకాశముందని, అంతరం తొలగిపోయే వీలుందని అంటున్నారు. నారాయణ సహా పలువురు గంటాతో ఫోన్లో మాట్లాడుతూ... సీఎం చంద్రబాబు వైఖరిని తెలియజేస్తూ అర్థం చేసుకోవాలని నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు. సీఎం పర్యటనలో పాల్గొనకపోతే పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బందికరమన్నారు.
గత కొన్నాళ్లుగా పార్టీలోని ప్రత్యర్థులు తనపై కుట్ర చేయడం, అధిష్టానానికి ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడంతో పాటు ఇటీవల ఓ సర్వేలో భీమిలి ప్రజల్లో తనపై అసంతృప్తి ఉందని తేలిందని రావడంపై గంటా కినుక వహించారు. ఈ నేపథ్యంలో స్వయంగా చంద్రబాబు కూడా ఆయనకు ఫోన్ చేశారని తెలుస్తోంది. పత్రికల్లో రకరకాల సర్వేలు వస్తుంటాయని, వాటిని మనసులో పెట్టుకోకుండా మన పని మనం చేసుకోవాలని చెప్పారట.