Home Minister Chinna Rajappa said that Minister Ganta Srinivasa Rao will contest from bhimili in next elections.
మంత్రి గంటా శ్రీనివాస రావు చల్లబడ్డారు. ఇటీవల పార్టీలోని రాజకీయ పరిణామాలు, లగడపాటి రాజగోపాల్‌కు చెందిన సంస్థ సర్వే ఫలితాలపై గంటా అసంతృప్తితో ఉన్నారు. దీంతో విశాఖపట్నంలో చంద్రబాబు పర్యటనకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.
అయితే, ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప.. గంటా నివాసానికి వెళ్లి ఆయనతో మంతనాలు జరిపారు. ఈ చర్చల్లో గంటా చల్లబడ్డారు. దీంతో అంతా సర్దుకుంది. చంద్రబాబు పర్యటనలో గంటా పాల్గొంటారు. గంటాతో భేటీ అనంతరం చినరాజప్ప మీడియాతో మాట్లాడారు.
తాము చేయించాలనుకున్న సర్వేను గంటా శ్రీనివాస్ ఎమ్మెల్యేగా ఉన్న భీమిలి నియోజకవర్గంలో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చేయించడం ఏమిటని చినరాజప్ప మండిపడ్డారు. లగడపాటికి గంటా పైన అంత కోపం ఎందుకని ప్రశ్నించారు. సర్వే ఫలితాలు చూసి గంటా మనస్తాపానికి గురయ్యారన్నారు. ఇది సహజమే అన్నారు. ఆ సర్వే ఫలితాలు అలక, ఆగ్రహం తెప్పించేలా ఉన్నాయన్నారు.