Priyanka Chopra Buys 100 Crore Bungalow In Mumbai

Filmibeat Telugu 2018-06-22

Views 3.2K

Priyanka Chopra and Nick Jonas landed in Mumbai last night and the paparazzi did everything possible to get a few good pictures of the couple, but the duo was in no mood to pose and hastily ran towards their car and the photographers ended up getting only a few pictures that too from their tainted window glass.

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా తన ప్రియుడు, అమెరికన్ సింగర్ నిక్ జోనస్‌తో కలిసి గురువారం రాత్రి ముంబైలో ల్యాండ్ అయ్యారు. అతడిని వెంటేసుకుని ముంబై రావడానికి ప్రత్యేక కారణం ఉందట. ప్రియాంక ముంబైలో కొత్తగా కొనుగోలు చేసుకుని భవంతి గృహ ప్రవేశ వేడుక కోసమే నిక్‌ను తీసుకుని వచ్చిందని, రూ. 100 కోట్లతో ప్రియాంక ఈ ఇంటిని కొనుగోలు చేసిందని బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ముంబై నడి ఒడ్డున అరేబియా సముద్ర ముఖంగా ఈ బంగళా ఉన్నట్లు సమాచారం.
ప్రియాంక కొనుగోలు చేసిన భవంతి గృహ ప్రవేశ కార్యక్రమం ఈ వారమే ఉంటుందని, నిక్‌ను తన జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తిగా భావిస్తోంది కాబట్టే అతడిని ప్రత్యేకంగా వెంట పెట్టుకుని ముంబై వచ్చినట్లు మీడియా కోడై కూస్తోంది.
గృహ ప్రవేశం తర్వాత కొన్ని రోజుల పాటు ప్రియాంక, నిక్ ఈ ఇంట్లోనే సహజీవనం చేస్తారనే పుకార్లు కూడా హాట్ టాపిక్ అయ్యాయి. అతడిని తన వెంట తీసుకురావడం వెనక అసలు కారణం ఇదే అయుంటుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
కొన్ని రోజులు ఇండియాలో గడిపిన తర్వాత ప్రియాంక, నిక్ తిరిగి యూఎస్ఏ వెళతారట. ఎందుకంటే ఇద్దరి కెరీర్ అమెరికాలోనే ఉంది. ప్రియాంక చోప్రా అమెరికన్ టీవీ సిరీస్ క్వాంటికోతో పాటు హాలీవుడ్ చిత్రాల్లోనూ నటిస్తోంది. నిక్ జోనస్ సింగర్‌గా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు.

Share This Video


Download

  
Report form