hough much of the focus before the game was on Argentina superstar Lionel Messi, it was Mbappe who produced a brilliant performance that will linger long in the memory.
రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్‌లో అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ పోరాటం ముగిసింది. నాకౌట్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఫ్రాన్స్ అద్భుత ప్రదర్శన చేసింది. శనివారం ఫ్రాన్స్‌తో జరిగిన నాకౌట్ పోరులో అర్జెంటీనా 4-3 తేడాతో ఓటమి పాలైంది. తాజా విజయంతో ఫ్రాన్స్ క్వార్టర్స్‌కు అర్హత సాధించింది.
గ్రూప్ స్టేజిలో వరుస విజయాలందుకున్న ఫ్రాన్స్ తన జైత్రయాత్రను కొనసాగించింది. అద్భుత ఫామ్‌లో ఉన్న కైలియన్ మొబప్పె వరుసగా రెండు అద్భుత గోల్స్ అందించి తమ జట్టుకు విజయాన్ని అందించాడు. తొలి అర్థబాగం వరకు ఇరు జట్లు సమానంగా పోరాడాయి. అర్జెంటీనా ఆటగాడు మార్కస్ రోజో 11వ నిమిషంలో చేసిన ఫౌల్‌తో ఫ్రాన్స్‌కు పెనాల్టీ లభించింది.
#argentina
#france
#worldcup2018
#football
#fifaworldcup
#russia