Dil Raju Speech Lover Audio Launch. Actor Raj Tarun & Actress Riddhi Kumar starrer Lover movie release date on July 20th posters. Directed by Annish Krishna.
#DilRaju
రాజ్ తరుణ్, రిద్ధికుమార్ జంటగా నటించిన చిత్రం లవర్. అనీష్ కృష్ణ దర్శకత్వం వహించారు. దిల్‌రాజు నిర్మాణ సారథ్యంలో శిరీష్ సమర్పణలో హర్షిత్ ఈ సినిమాను నిర్మించారు. జూలై 20న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతేడాది వరుసగా ఆరు సక్సెస్ కొట్టాం.. ఫోర్లు, సిక్సులు కొట్టిన తర్వాత బాల్ కొట్టేపుడు బ్యాట్స్‌మెన్‌కు ఎంత నర్వస్ ఉంటుందో... ప్రస్తుతం మా పరిస్థితి అలాగే ఉందని వ్యాఖ్యానించారు.
మా ఫ్యామిలీలో హర్షిత్ సెకండ్ జనరేషన్ కిడ్. తను సొంతగా సినిమా చేస్తానంటే.. అనీశ్ చెప్పిన కథతో సినిమా మొదలు పెట్టాం. నిర్మాతగా హర్షిత్ తొలి సినిమా ఇది. నా తొలి సినిమాకు కూడా నెర్వస్ ఫీల్ కాలేదు .. కానీ ఈ సినిమా కాస్త నెర్వస్‌గా ఫీల్ అవుతున్నాను. నేను చేయడానికి, వెనకుండి చేయించడానికి చాలా తేడా ఉంది. చాలా కష్టమైన పని కూడా. ఎందుకంటే మనకి కొన్ని నచ్చుతాయి. వాళ్లికి వేరే నచ్చుతాయి. వాళ్లే కరెక్ట్ అని అంటుంటారు. ఇప్పటి వరకు ఇంత టఫ్ జాబ్ డైరెక్టర్స్‌తో ఫేస్ చేశాను. ఈసారి హర్షిత్‌తో ఫేస్ చేశాను.... అని దిల్ రాజు తెలిపారు.