Imran Khan's party - Pak Tehreek-e-Insaf or PTI - is considering inviting leaders of SAARC countries, including Prime Minister Narendra Modi to his oath taking ceremony as the Prime Minister of Pak, a party official said today.
#narendramodi
#india
#imrankhan
#saarc
#PrimeMinister
పాకిస్థాన్ ప్రధానమంత్రిగా ఆగస్టు 11న ప్రమాణం స్వీకారం చేయనున్నట్లు ఇప్పటికే పాకిస్థాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్(పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించి ఇప్పుడొక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. పాక్ ప్రధానిగా ఇమ్రాన్ ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ సహా సార్క్ దేశాధినేతలను ఆహ్వానించాలని పీటీఐ నిర్ణయించినట్లు సమాచారం. 'ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకారానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ సహా సార్క్(ఆఫ్ఘనిస్థాన్, నేపాల్, భూటాన్, భారత్, బంగ్లాదేశ్, మాల్దీవులు, శ్రీలంక) దేశాధినేతలను ఆహ్వానించాలని పీటీఐ కోర్ కమిటీ భావిస్తోంది. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం' అని పీటీఐ నేత ఒకరు మీడియాకు తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ.. ఇమ్రాన్ ఖాన్‌కు ఫోన్ చేసి అభినందనలు తెలిపిన విషయాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా తెలిపారు. సార్క్‌లో పాకిస్థాన్‌కూడా సభ్య దేశమే.