Priyanka Chopra Breaks Her Silence About Engagement Rumours

Filmibeat Telugu 2018-08-07

Views 699

Priyanka Chopra Breaks Silence on Reports of Her Engagement With Nick Jonas. "My personal life is not for public consumption. 10 per cent is for me. I am a girl and I have the right to keep that to myself. My family, friendship, my relationships are things I don't think I need to defend or explain it to anyone," Priyanka was quoted as saying by PTI.
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా కొన్ని రోజులుగా అమెరికన్ సింగర్, నటుడు నిక్ జొనాస్‌తో ప్రేమలో మునిగితేలుతున్న సంగతి తెలిసిందే. అతడిని ఇండియాకు తీసుకొచ్చి తన ఫ్యామిలీకి పరిచయం చేయడంతో ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. సెప్టెంబర్ 16న నిక్ పుట్టినరోజు సందర్భంగా వీరి ఎంగేజ్మెంట్ జరుగుతుందనే రూమర్స్ సైతం ప్రచారంలోకి వచ్చాయి. తన ప్రేమ గురించి, అతడితో ఎఫైర్ గురించి ఎన్ని వార్తలు వచ్చినా ఇన్నాళ్లు మౌనంగా ఉన్న ప్రియాంక ఎట్టకేలకు నోరు విప్పారు.
సోమవారం ఢిల్లీలో జరిగిన ఓ ఈవెంటుకు హాజరైన ప్రియాంక చోప్రాను.... మీడియా చుట్టుముట్టింది. మీరు అమెరికన్ సింగర్ నిక్ జొనాస్‌ను పెళ్లాడబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి నిజమేనా? మీ పెళ్లి ఎప్పుడు జరుగుతుంది? అతడితో ఎన్నాళ్లుగా రిలేషన్ షిప్‌లో ఉన్నారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
‘నా మొత్తం జీవితంలో తొంభై శాతం తెరచిన పుస్తకమే. కానీ ఒక్క పది శాతం మాత్రమైనా ప్రైవసీగా ఉండాలని కోరుకుంటా. ముఖ్యంగా వ్యక్తిగత జీవితం గురించి ఓ సాధారణ అమ్మాయిలాగే ఆలోచిస్తా'... అని ప్రియాంక తెలిపారు.

Share This Video


Download

  
Report form