తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మృతిపై పలువురు క్రికెటర్లు సంతాపం తెలియజేశారు. గత కొన్ని రోజులుగా తమిళనాడు రాజధాని చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం సాయంత్రం గం.6.10 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు.
కరుణానిధి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. జూలై 26వ తేదీన ఆయన్ని కావేరీ ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. కరుణ మృతి నేపథ్యంలో బుధ, శుక్రవారాల్లో ప్రభుత్వ కార్యక్రమాలను రద్దు చేశారు.
#MKarunanidhi
#Marina
#crickters
#virendersehwag
#vvslaxman