Ajinkya needs to understand this': Laxman recalls advice from 'great Sachin Tendulkar', explains Rahane's mistake
#ViratKohli
#KYLEJamieson
#Worldtestchampionship
#WTCFinal
#IndvsNz
#KaneWilliamson
అనుభవజ్ఞుడైన అజింక్య రహానే అలా పేలవ షాట్ ఆడి పెవిలియన్ చేరడం తనను చాలా నిరాశపరిచిందని టీమిండియా మాజీ బ్యాట్స్‌మన్, హైదరాబాద్ సొగసరి వీవీఎస్ లక్ష్మణ్ అన్నారు. స్క్వేర్ లెగ్‌లోకి ఫీల్డర్ వచ్చినప్పటికీ అతను సగం షాటే ఆడి మూల్యం చెల్లించుకున్నాడన్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో 117 బంతులు ఎదుర్కొన్న రహానే ఐదు బౌండరీల సాయంతో 49 పరుగులు చేసి ఔటయ్యాడు. నిజానికి విరాట్ కోహ్లీతో కలిసి శనివారం ఏకాగ్రతగా బ్యాటింగ్ చేసిన రహానే.. ఆదివారం హాఫ్ సెంచరీ మార్క్‌ని అందుకునే క్రమంలో కాస్త తొందరపడ్డాడు.