Shane Warne Responded To The News Coming Upon Him Through Twitter | Oneindia telugu

Oneindia Telugu 2019-02-15

Views 235

Former spin legend Shane Warne has denied reports that he had asked the BCCI to avoid a former Australian coach Ricky Ponting, who is the coach of the Delhi Capitals , in the Indian Premier League (IPL). Shane Warne made clear that there is no truth in the news.
#shanewarne
#cricket
#australia
#ipl2019
#rickyponting
#bcci
#australiancoach
#delhicapitals
#england
#worldcup

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రధాన కోచ్‌గా ఉన్న ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్‌ను తప్పించాలంటూ తాను బీసీసీఐని కోరినట్లు వస్తున్న వార్తలను మాజీ స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ ఖండించాడు. అసలు ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదని షేన్ వార్న్ స్పష్టం చేశాడు.

ఈ మేరకు ట్విట్టర్‌లో షేన్ వార్న్ స్పందిస్తూ "ఐపీఎల్ నుంచి పాంటింగ్‌ను బ్యాన్ చేయాలని నేను వ్యాఖ్యానించినట్లు వస్తున్న కథనాలు పూర్తిగా అసత్యమైనవి. వాటిలో ఎంతమాత్రం వాస్తవం లేదు. ఇటువంటి చెత్త న్యూస్‌ను ఆపండి. ఆస్ట్రేలియా టీమ్‌కు అసిస్టెంట్ కోచ్‌గా ఎంపికైనందున పాంటింగ్‌ను ఢిల్లీ కోచ్‌గా తీసేయమని నేను కోరితే అది కచ్చితంగా అది ఒక అవివేకమైన చర్య. ఒకవేళ బీసీసీఐ అలాంటి చర్యలు తీసుకుంటే. పాంటింగ్ అంగీకరించాల్సి ఉంటుంది" అని ట్వీట్ చేశాడు.

Share This Video


Download

  
Report form