Icc World Cup 2019 : Cricket Fans Are Waiting For Interesting Mega Tourney.

Oneindia Telugu 2019-02-19

Views 127

England will open the tournament at The Oval on 30 May when they will take on South Africa, while Australia will launch their title defence on 1 June against the ICC Cricket World Cup Qualifier champions Afghanistan in a day/night match in Bristol.
#iccworldcup2019
#england
#icc
#teamindia
#australia
#afghanistan
#bristol
#westindies
#srilanka
#ovalground
#lardsstadium

ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ఆతిథ్యమిస్తోన్న ఈ వరల్డ్‌కప్‌లో మొత్తం పది జట్లు బరిలో దిగుతున్నాయి. 20 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్‌ మళ్లీ వన్డే వరల్డ్‌కప్‌కు ఆతిథ్యమివ్వబోతోంది.11 వేదికల్లో జరిగే ప్రపంచకప్‌లో మొత్తం 48 మ్యాచ్‌లు అభిమానులను అలరించనున్నాయి.

ఈ ఏడాది మే 30న ప్రారంభమయ్యే ఈ వరల్డ్ కప్ జూలై 14న ముగియనుంది. ఈ సారి వరల్డ్‌కప్‌ను రౌండ్‌రాబిన్ పద్థతిలో నిర్వహిస్తున్నారు. టాప్-4లో నిలిచిన జట్లు సెమీఫైనల్లోకి ప్రవేశిస్తాయి. సెమీస్ విజేతలు చారిత్రక లార్డ్స్ మైదానంలో ఫైనల్లో తలపడతాయి. ఐదుసార్లు వరల్డ్‌కప్‌ను నెగ్గిన డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో పాటు భారత్, ఇంగ్లాండ్ టైటిల్ ఫేవరెట్లలో ముందువరుసలో ఉన్నాయి. వరల్డ్‌కప్ టోర్నీకి సరిగ్గా 100 రోజులు ఉన్న నేపథ్యంలో అభిమానుల కోసం ప్రత్యేకం.చివరగా 1999లో ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ టోర్నీని ఆ దేశం నిర్వహించింది. అంతేకాదు వరల్డ్‌కప్‌కు అత్యధికంగా ఐదు సార్లు ఆతిథ్యమిచ్చిన దేశం ఇంగ్లాండే కావడం విశేషం. తొలి మూడు వరల్డ్‌కప్‌లు (1975, 79, 83) ఇంగ్లాండ్‌లోనే జరిగాయి. మే 30న ఓవల్‌ మైదానంలో ఇంగ్లాండ్‌-దక్షిణాఫ్రికా మ్యాచ్‌తో 2019 వరల్డ్‌కప్ ఆరంభం కానుంది. జులై 14న లార్డ్స్‌లో ఫైనల్‌ జరుగుతుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS