India Vs Australia 2019: India Lose 5th ODI By 35 Runs | Match Highlights | Oneindia Telugu

Oneindia Telugu 2019-03-14

Views 242

Australia's score of 272 was more than challenging for India as the visitors won the deciding game of the five-match series by 35 runs on a slow and low Ferozeshah Kotla wicket on Wednesday to clinch the series 3-2.
The series win comes not just at the right time for the Aussies as the World Cup is round the corner, but is also their first series victory in India in six years.
#indiavsaustralia5thodi
#australiainindia2019
#india
#odi
#cricket
#viratkohli
#aaronfinch
#maxwell
#yuzvendrachahal
#kawaja
#rishabhpant

వరల్డ్‌కప్ ముందు ఆడిన చివరి వన్డే సిరిస్‌ను టీమిండియా చేజార్చుకుంది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 273 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 237 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో ఆసీస్‌తో బుధవారం ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో టీమిండియా 35 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ఐదు వన్డేల సిరిస్‌ను ఆస్ట్రేలియా 3-2తేడాతో కైవసం చేసుకుంది. చివరి రెండు వన్డేల్లో వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీకి విశ్రాంతినివ్వడం ఐదు వన్డేల సిరీస్‌ను వరుసగా రెండు విజయాలతో ఆరంభించిన టీమిండియా.. ఆ తర్వాత ప్రయోగాల వెంట పరుగెత్తి చివరి మూడు వన్డేల్లోనూ ఓడిపోయింది. 273 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు సరైన ఆరంభం లభించలేదు. ఆరంభంలోనే ఓపెనర్ శిఖర్ ధావన్ (12), కెప్టెన్ విరాట్ కోహ్లి (20) పేలవంగా వికెట్లు చేజార్చుకున్నారు.

ఆ తర్వాత వచ్చిన రిషబ్ పంత్ (16), విజయ్ శంకర్ (16) కూడా నిరాశపరిచారు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ (56: 89 బంతుల్లో 4 పోర్లు) హాఫ్ సెంచరీతో ఒంటరిగా పోరాడాడు. జట్టు స్కోరు 132 వద్ద రోహిత్ శర్మ పెవిలియన్‌కు చేరగా... ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా (0) డకౌటయ్యాడు. 28.5 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ 132/6తో పీకల్లోతు కష్టాల్లో నిలిచింది.చివర్లో కేదార్ జాదవ్(44), భువనేశ్వర్ కుమార్(46)లు ఓ సమయంలో భారత్‌ గెలుపుపై ఆశలు చిగురించేలా చేశారు. అయితే, వీరిద్దరూ కీలక సమయంలో వికెట్లు కోల్పోవడంతో టీమిండియా ఓటమి ఖరారైంది. దీంతో నిర్ణీత ఓవర్లలో 237 పరుగులకు భారత్‌ ఆలౌటైంది. దీంతో 35 పరుగుల తేడాతో విజయం సాధించిన ఆసీస్ సిరీస్‌ను 3-2తో చేజిక్కించుకుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS