కర్నాటక రాజకీయాల్లో ట్విస్టులు మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. కుమార స్వామి ప్రభుత్వానికి ఢోకాలేకుండా చూసే బాధ్యతను తన భుజాలపై వేసుకున్నారు కర్నాటక కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్. తాజాగా మరో సారి చర్చలు జరిపి సక్సెస్ అయ్యారు శివకుమార్. రాజీనామా చేసిన హోస్‌కోటె కాంగ్రెస్ ఎమ్మెల్యే నాగరాజుతో చర్చలు జరిపిన తర్వాత తాను రాజీనామాను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు.