The Indian boxers finished their campaign with nine medals, including seven gold and two silver, which helped the contingent win the 'Best Team' award.
#MaryKom
#President'sCup2019
#GoldMedal
#boxing
భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్ అంతర్జాతీయ స్థాయిలో మరోసారి సత్తా చాటింది. ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్ మేరీకోమ్ ప్రెసిడెంట్స్ కప్ బాక్సింగ్ టోర్నీలో స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. ఆదివారం ఇండొనేసియాలోని లబువాన్ బజోలో 51 కేజీల విభాగం ఫైనల్లో మేరీ 5-0తో ఏప్రిల్ ఫ్రాంక్స్ (ఆస్ట్రేలియా )ను ఓడించింది. మూడు నెలల్లో ఆమెకిది రెండో స్వర్ణం. గత మేలో ఇండియా ఓపెన్ బాక్సింగ్ టోర్నీలోనూ మేరీ స్వర్ణం గెలిచిన విషయం తెలిసిందే. 2020 టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంతో పాటు.. స్వర్ణం కైవసం చేసుకోవాలని మేరీ ధ్యేయంగా పెట్టుకుంది. గత మేలో థాయ్‌లాండ్‌లో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌నకు దూరంగా ఉన్న మేరీ.. ప్రపంచ చాంపియన్‌షిప్‌నకు ముందు తన సత్తా చాటింది.