Mahela Jayawardene Has Not Applied For India's Head Coach Role || Oneindia Telugu

Oneindia Telugu 2019-08-02

Views 72

The Board of Control for Cricket in India (BCCI) has invited fresh applications to fill the head coach and support staffs which will be vacant after the series against West Indies.
#MahelaJayawardene
#ravisashtri
#tommoody
#VirenderSehwag
#viratkohli
#crikcet


టీమిండియా హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి ఎంపిక దాదాపు ఖాయమైంది. ఈ పోస్ట్ భర్తీ కోసం ఇటీవల భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నోటిఫికేషన్ విడుదల చేయగా.. దేశ, విదేశీ క్రికెటర్లు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. దీంతో.. ప్రస్తుతం కోచ్‌గా ఉన్న రవిశాస్త్రికి గట్టి పోటీ తప్పదని అంతా భావించారు. దాదాపు రెండు వేల దరఖాస్తులు ప్రధాన కోచ్‌ పదవి కోసం వచ్చినట్లు జాతీయ పత్రిక బెంగళూరు మిర్రర్‌ పేర్కొంది. ఆసీస్‌ మాజీ ఆల్‌ రౌండర్‌ టామ్‌ మూడీతో పాటు న్యూజిలాండ్‌ మాజీ కోచ్‌, కింగ్స్‌ పంజాబ్‌ కోచ్‌ మైక్‌ హెస్సెన్‌లు దరఖాస్తు చేసుకున్నారని తెలిపింది. మరొకవైపు భారత్‌ నుంచి రాబిన్‌సింగ్‌, లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌లు దరఖాస్తు చేసుకున్నారని పేర్కొంది. ప్రస్తుత కోచ్‌ రవిశాస్త్రి కోచ్‌ పదవి కోసం నిర్వహించే ఇంటర్యూకు నేరుగా హాజరవుతాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS