Former Indian opener Wasim Jaffer on Monday shared another hidden message for stand-in skipper Ajinkya Rahane suggesting to him the batting lineup of the Indian team for the impending third Test against Australia, scheduled to be played at the Sydney Cricket Ground starting January 7.
#IndvsAus2021
#IndvsAus3rdTest
#WasimJaffer
#AjinkyaRahane
#KLRahul
#ShubhmanGill
#RohitSharma
#CheteshwarPujara
#MayankAgarwal
#Cricket
#TeamIndi
ఆస్ట్రేలియాతో నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా జరిగిన డే/నైట్ టెస్ట్‌లో చిత్తుగా ఓడిన టీమిండియా.. మెల్బోర్న్ టెస్ట్‌లో అద్భుత విజయాన్నందుకొని ఆ ఘోరపరాజయానికి బదులు తీర్చుకుంది. సిరీస్‌ను 1-1తో సమం చేసి రేసులో నిలిచింది. దాంతో సిడ్నీ వేదికగా జరగనున్న మూడో టెస్ట్ ఇరు జట్లకు కీలకంగా మారింది. అయితే ఈ మ్యాచ్ బరిలోకి దిగే టీమిండియా తుది జట్టుపై తీవ్ర చర్చ జరుగుతుంది. గాయం నుంచి కోలుకున్న రోహిత్ శర్మ అందుబాటులోకి రావడం.. ఓపెనర్‌గా మయాంక్ అగర్వాల్ దారుణంగా విఫలమవడం, గాయంతో ఉమేశ్ యాదవ్ దూరమవడంతో జట్టులో మార్పులు అనివార్యంగా కనిపిస్తున్నాయి. దాంతో మాజీ ఆటగాళ్లు, క్రికెట్ విశ్లేషకులు జట్టు కూర్పు విషయంలో తాత్కలిక సారథి అజింక్యా రహానేకు పలు సూచనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ కూడా రహానేకు కీలక సలహా ఇచ్చాడు. అయితే ఈ సలహాను వసీం జాఫర్ ట్విటర్ వేదికగా మరోసారి తనదైన శైలిలో చెప్పడం చర్చనీయాంశమైంది. టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ గురించి కోడింగ్ మెసేజ్ రూపంలో సలహా ఇచ్చిన వసీం జాఫర్.. దాన్ని డీకోడ్ చేయాలని పేర్కొన్నాడు.