IPL 2021: Rajasthan Royals request overseas players on loan from other franchises
#IPL2021
#RajasthanRoyals
#BenStokes
#SanjuSamson
#Morris
#JofraArcher
#AndrewTye
ఐపీఎల్ 2021 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు ఏది కలిసి రావడం లేదు. కొత్త కెప్టెన్, డైరెక్టర్‌ను నియమించుకున్నా ఆ జట్టు రాత మారలేదు. మైదానంలో వరుస పరాజయాలకు తోడు గాయాలు, కరోనా భయంతో ఒక్కొక్కరుగా జట్టును వీడటం ఆ ఫ్రాంచైజీని కలవరపెడుతోంది. సీజన్‌కు ముందే గాయంతో స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ దూరం కాగా.. ఫస్ట్ మ్యాచ్‌లోనే చేతి వేలిగాయానికి గురైన బెన్ స్టోక్స్ సర్జరీ చేయాల్సి రావడంతో ఇంగ్లండ్ పయనమయ్యాడు. ఆ తర్వాత బయో బబుల్‌లో ఉండలేక లివింగ్ స్టోన్ టీమ్‌కు గుడ్‌బై చెప్పగా.. దేశంలోని కరోనా సంక్షోభాన్ని చూడలేక ఆండ్రూ టై ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కాడు. దాంతో రాజస్థాన్ రాయల్స్ ఏకంగా నలుగురు విదేశీ ఆటగాళ్ల సేవలను కోల్పోయింది.