Twitter feels bad for Marcus Stoinis after Adam Zampa gets married to his girlfriend
#AdamZampa
#MarcusStoinis
ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రేయసి హట్టి లీ పాల్మెర్‌ను ఈ ఆసీస్ స్పిన్నర్ సీక్రెట్‌గా పెళ్లిచేసుకున్నాడు. వీరి లవ్వయాణం గురించి అందరికీ తెలిసినప్పిటికీ.. కరోనా మహమ్మారి కారణంగా వివాహం ఇప్పటికి రెండుసార్లు వాయిదా పడింది. దాంతో జంపా ఎవరికీ తెలియకుండా గతవారమే తన ప్రేయసిని వివాహమాడాడు. గతేడాది ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు లాక్‌డౌన్‌లో చిక్కుకోవడంతో జంపా సహా పలువురి వివాహాలు వాయిదా పడ్డాయి. ఆ తర్వాత వారిలో చాలామంది ఏదో రకంగా వివాహాలు చేసుకుని జంటలుగా మారారు. వైరస్ ఇంకా భయపెడుతుండడంతో కొందరు క్రికెటర్లు మాత్రం ఇంకా శుభ ఘడియల కోసం ఎదురుచూస్తున్నారు.