Tokyo Olympics: Bronze is worth gold to my family, says Bajrang Punia
#BajrangPunia
#India
ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్‌లో మోకాలి గాయం కారణంగానే సెమీస్‌లో విజయం సాధించలేకపోయానని భారత స్టార్ రెజ్లర్, బ్రాంజ్ మెడలిస్ట్ బజరంగ్ పునియా తెలిపాడు. తాను సాధించింది కాంస్యమే అయినప్పటికి అది తన కుటుంబ సభ్యులకు స్వర్ణంతో సమానమని చెప్పాడు. ప్లేఆఫ్ మ్యాచ్‌కు ముందు తన మోకాలి గాయం గురించి తన తల్లి ఓం ప్యారీ భయపడిందని గుర్తు చేసుకున్నాడు. మెడల్ కన్నా ఎక్కువగా గాయం గురించి ఆలోచించిందని వెల్లడించాడు.