ipl 2022 : good news for rcb fans. josh hazlewood returns
#ipl2022
#viratkohli
#rcb
#glennmaxwell
#joshhazlewood
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెయిన్ మాక్స్‌వెల్ చేరడంతో ఆ జట్టు అభిమానులు ఆనందంలో ఉన్నారు. మాక్స్‌వెల్ నేడు రాజస్థాన్ రాయల్స్‌తో జరగనున్న మ్యాచ్‌కు కాకపోయినా తర్వాతి మ్యాచ్ నుంచి జట్టుకు అందుబాటులో ఉండనున్నాడు. కాగా ఇంతలోనే ఆర్సీబీకి మరో గుడ్ న్యూస్ అందింది. ఆ జట్టు మెగా వేలంలో భారీ ధరకు కొనుగోలు చేసిన ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ కూడా త్వరలో టీం క్యాంపులో అడుగుపెట్టనున్నాడు. ఈ నెల 12న చెన్నైసూపర్ కింగ్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆడనున్న మ్యాచ్‌కు జోష్ హేజిల్‌వుడ్ అందుబాటులో ఉండే అవకాశాలు ఉన్నాయి.