Gautam Gambhir hits back at critics, who were questioning his participation in IPL | పార్లమెంట్ సభ్యుడిగా ప్రజలకు అందుబాటులో ఉండకుండా డబ్బుల కోసం ఐపీఎల్‌లో పని చేస్తున్నాడంటూ తనపై వచ్చిన విమర్శలకు టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఘాటుగా సమాధానమిచ్చాడు. తాను ఢిల్లీలో 5 వేల మందికి భోజనాలు పెడుతున్నానని, వారి కోసం నెలకు రూ.25 లక్షలు తన జేబులో నుంచే ఖర్చు అవుతుందని తెలిపాడు. తమ ఇంట్లో డబ్బులు కాచే చెట్టు లేదని, అందుకే ఐపీఎల్‌లో పని చేస్తున్నానని స్పష్టం చేశాడు. ఇలా చేస్తున్నందుకు తాను ఏ మాత్రం సిగ్గు పడటం లేదన్నాడు.
#GautamGambhir
#IPL
#Cricket