1998 DSC Qualifiers : మాకూ న్యాయం చేయండంటున్న తెలంగాణ అభ్య‌ర్థులు | ABP Desam

Abp Desam 2022-06-24

Views 5

23 ఏళ్ల పోరాటం ఫ‌లించింది. ఏపి లో నాలుగు వేలమందికి పైగా టీచ‌ర్ ఉద్యోగాలు పొంద‌పోతున్నారు. అస‌లు ఎందుకు ఇలా జ‌రిగింది అనేది తెలియాలంటే 1998 DSC చరిత్ర తెలుసుకోవాల్సిందే. 1998లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డీఎస్సీ-1998 నోటిఫికేషన్ జారీచేసింది. (ఆంధ్రప్రదేశ్ చరిత్ర లో అతి పెద్ద డీఎస్సీ). ఆ సమయంలో అభ్యర్థుల కటాఫ్ మార్కులకు సంబంధించి.. ఓసీలకు 50, బీసీలకు 45; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 40 మార్కులను కటాఫ్‌గా నిర్ణయించింది. ఆ మేరకు అర్హత సాధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు కూడా పిలిచారు. దీనికి సంబంధించి అప్పటి ప్రభుత్వం 221 జీవోను జారీ చేసింది. అయితే కొన్ని విభాగాల్లో కటాఫ్ ఉన్న అభ్యర్థులు లేకపోవడంతో ఓసీలకు 45, బీసీలకు 40; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 35 మార్కులను కటాఫ్‌గా నిర్ణయిస్తూ ప్రభుత్వం మరో జీవో 618 విడుదల చేసింది. అయితే అదే సమయంలో రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావడంతో కొన్ని జిల్లాల్లో నియామక ప్రక్రియను అధికారులు వాయిదా వేశారు. ఆయా జిల్లాల్లో తర్వాత ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ప్రభుత్వం ఇలా రెండు జీవోలు జారీచేయడంతో.. మొదట 221 జీవో ప్రకారం ఎక్కువ కటాఫ్ మార్కులు ఉన్న అభ్యర్థులందరికీ ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత.. 618 జీవో ప్రకారం తక్కువ కటాఫ్ మార్కులు ఉన్న అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది. 23 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS