కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. కేంద్ర విద్యుత్ బిల్లుపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడారు. 2020లో పార్లమెంటులో ప్రవేశపెట్టిన సవరించిన విద్యుత్ బిల్లులో.. రాష్ట్ర ప్రభుత్వం పలు కేటగిరీల వినియోగదారులకు అందించే విద్యుత్ సబ్సిడీలను రద్దు చేయాలని కేంద్రం ఎక్కడా చెప్పలేదన్నారు. మేం సబ్సిడీలు ఇస్తుంటే కేంద్రం తొలగించమంటోంది అంటూ జరుగుతున్న వాదనల్లో నిజం లేదని స్పష్టం చేశారు. అంత్యోదయ అనే సిద్ధాంతంపైనే పుట్టిన బీజేపీ పేదలకు అన్యాయం చేసేందుకు ఎప్పుడూ ప్రయత్నించదని అన్నారు.
Telangana Assembly Sessions Stared..!!
#telangana
#telanganaassembly
#balkasuman
#cmkcr
#pmmodi