Telangana Budget 2024 : కొత్త బడ్జెట్లో ప్రభుత్వం సాగునీటి రంగంలో తుదిదశలో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణానికి పెద్దపీట వేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఆయకట్టు పెంచే 18 ప్రాజెక్టులను రెండేళ్లలో పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ బడ్జెట్లో సాగునీటి రంగానికి ఏకంగా రూ.22,301 కోట్లను కేటాయించింది.