Mangalagiri Cricket Stadium Remodel: రాజధాని అమరావతిలో భాగమైన మంగళగిరి క్రికెట్ స్టేడియం రూపురేఖల్ని అత్యాధునిక సౌకర్యాలతో మార్చేందుకు సిద్ధమైంది ఆంధ్రా క్రికెట్ అసోషియేషన్! వచ్చే రెండేళ్లలో ఐపీఎల్ సహా అంతర్జాతీయ మ్యాచ్‌ల నిర్వహణ దిశగా ఏసీఏ పాలకవర్గం ప్రణాళికలు సిద్దం చేస్తోంది. గత టీడీపీ హయాంలోనే స్టేడియం నిర్మాణ పనులు 90 శాతం పూర్తవ్వగా, వైఎస్సార్సీపీ జమానాలో గాలికి వదిలేశారు. మధ్యలో ఆగిన నిర్మాణాలు కొన్నిచోట్ల దెబ్బతిన్నాయి. వీటిపై నిపుణులు కమిటి నివేదిక రాగానే టెండర్లు పిలిచి పనులు చేపట్టాలని ఏసీఏ భావిస్తోంది.