Capital Amaravati Development Works: ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో నిలిచిపోయిన రాజధాని అమరావతి నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం తిరిగి దృష్టి సారించింది. మధ్యలో నిలిచిపోయిన భవనాల సామర్థ్యాన్ని ఐఐటీ హైదరాబాద్, మద్రాస్ నిపుణుల బృందం పరిశీలిస్తోంది. నిపుణుల బృందం ఏయే అంశాలను పరిశీలించనుంది. చాలా చోట్ల నిర్మాణాలకు సంబంధించి పనులో మధ్యలో ఆగిపోయాయి. కొన్ని చోట్ల పునాదుల్లోకి నీళ్లు చేరి సంవత్సరాల తరబడి నుంచి అవి చెరువులను తలపిస్తున్నాయి.