AP Agriculture Budget 2024 : ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. శాసనసభలో మంత్రి అచ్చెన్నాయుడు రూ.43,402.33 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అలాగే శాసనమండలిలో వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి నారాయణ ప్రవేశపెట్టారు. భూసార పరీక్షలకు రూ.38.88కోట్లు, విత్తనాలు పంపిణీ కి రూ.240కోట్లు, ఎరువుల సరఫరాకు రూ.40కోట్లు, పొలం పిలుస్తోంది రూ.11.31కోట్లు, ప్రకృతి వ్యవసాయానికి రూ.422.96కోట్లు కేటాయించారు. డిజిటల్ వ్యవసాయo రూ.44.77కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణ రూ.187.68కోట్లు, వడ్డీలేని రుణాలకు రూ.628కోట్లు, అన్నదాత సుఖీభవ రూ.4500కోట్లు, రైతు సేవా కేంద్రాలకు రూ.26.92కోట్లు కేటాయించారు.