Telangana Budget 2024 : సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 'నా తెలంగాణ కోటి రతనాల వీణ' అన్న దాశరథి కవితతో భట్టి బడ్జెట్ స్పీచ్ ప్రారంభించారు.