Manish Pandey played a captain's knock to guide India 'A' to a one-wicket victory over South Africa 'A', almost clinching a place in the final of the tri- series one-day tournament here on Thursday (August 3).
దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత్ ఏ జట్టు ఫైనల్‌కు చేరింది. దక్షిణాఫ్రికా ఏతో జరిగిన మ్యాచ్‌లో భారత ఏ జట్టు వికెట్ తేడాతో విజయం సాధించింది. తద్వారా ఫైనల్‌కు అర్హత సాధించింది. ఇండియా ఏ జట్టు కెప్టెన్ మనీశ్ పాండే 85 బంతుల్లో 93 పరుగులతో ఆజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 267 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా ఏ జట్టు రెండు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేధించింది.