The latest entrant into Congress, A Revanth Reddy , will take up a campaign against KCR and family rule either from Kodangal, the assembly constituency he represented, or Chevella.
కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి త్వరలో పాదయాత్ర చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. చేవెళ్ల నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభం కావొచ్చుననే ప్రచారం సాగుతోంది.
చేవెళ్లలో రేవంత్‌కు మంచి ఫాలోయింగ్ ఉందని, వారంతా ఇక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభించాలని కోరుతున్నారని తెలుస్తోంది. మరోవైపు, రేవంత్ మంగళవారం మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ నేత సర్వే సత్యనారాయణను కలిశారు.
సర్వే సత్యనారాయణ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్‌లోని ఆయన నివాసం వద్ద మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో రేవంత్ పాల్గొన్నారు.