Sri Venkateswara Creations 2017 success celebrations. Dil Raju produced Sathamanam Bhavathi, Duvvada Jaganandham, Nenu Local, Raja The Great, Fida, MCA this year.
టాలీవుడ్లో సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకున్న దిల్ రాజుకు.... 2017 సంవత్సరం మరిచిపోలేని జ్ఞాపకాలను మిగిల్చింది. ఈ ఏడాది దిల్ రాజు 6 సినిమాలు నిర్మిస్తే ఆరు చిత్రాలు సక్సెస్ అయ్యాయి. ఇప్పటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఇలా ఒకే సంవత్సరంలో డబల్ హాట్రిక్ కొట్టిన నిర్మాత లేడు. ఈ నేపథ్యంలో దిల్ రాజు గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మోస్ట్ సక్సెఫుల్ ఇయర్(2017) పేరుతో నిర్వహించిన కార్యక్రమానికి సినిమాల్లో నటించిన నటీనటులతో పాటు ఇండస్ట్రీ ప్రముఖులు హాజరయ్యారు.
ఈ ఏడాది దిల్‌రాజు నిర్మించిన ‘శతమానంభవతి', ‘నేను లోకల్', ‘డీజే: దువ్వాడ జగన్నాథమ్', ‘ఫిదా', ‘రాజా ది గ్రేట్', ‘ఎంసీఏ' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకున్నాయి.
దిల్ రాజు నిర్మించి ‘డిజె-దువ్వాడ జగన్నాథమ్' చిత్రంలో హీరోగా నటించిన బన్నీ ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. ఒకే సంవత్సరంలో ఆరు సక్సెస్‌లు సాధించడం దిల్ రాజుకే చెల్లిందని అన్నారు
దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ‘అప్పుడెప్పుడో యువరాజు ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టాడు. ఈ ఏడాది దిల్‌రాజు ఆరు సినిమాలు హిట్ కొట్టారు అని హరీష్ శంకర్ తెలిపారు.
అనిల్ రావిపూడి మాట్లాడుతూ ''ఇయర్ ఎగ్జామ్స్ అయ్యాక స్టూడెంట్స్ అందరినీ లైన్‌లో పిలిచి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నట్టు అనిపిస్తోంది. ఈ సంస్థ తీసిన 27 చిత్రాల్లో 90 శాతానికి మించి హిట్లున్నాయి అని తెలిపారు.