Union Finance minister Arun Jaitley may give importance to digitalisation in annual Budget.
వచ్చే బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ డిజిటలైజేషన్‌కు ప్రాముఖ్యం ఇచ్చే అవకాశం ఉంది. డిజిటలైజేషన్‌ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. డిజిటల్ చెల్లింపులు పెరిగితే తప్ప డిజిటలైజేషన్ లక్ష్యం నెరవేరదు. పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకింగ్ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన పెరిగినట్లు ప్రభుత్వం భావిస్తోంది. బ్యాంకింగ్ వ్యవస్థలో డిజిటలైజేషన్‌కు అత్యంత ప్రాముఖ్యం ఇచ్చే అవకాశం ఉంది.
దాంతో డిజిటల్ చెల్లింపులకు, డిజిటల్ చెల్లింపుల సేవలు అందించే సంస్థలకు బడ్జెట్‌లో రాయితీలు ఉంటాయని భావిస్తున్నారు. ప్రస్తుతం బ్యాంకింగ్‌పై ఉన్న 18 శాతం జిఎస్టీని తగ్గించే అవకాశం కూడా ఉందని అంటున్నారు. లావాదేవీలను పెంచేందుకు మైక్రో ఎటిఎం లావాదేవీలపై చార్జీలను 0.5 శాతం నుంచి 1 శాతానికి పెంచాలనే నిర్ణయాన్ని మరోమారు సమీక్షించాల్సిన అవసరం ఉంటుంది. ఆన్‌లైన్ నగద లావాదేవీలకు సంబంధించి సైబర్ భద్రతను మరింత కట్టుదిట్టం చేయాల్సి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.