IPL Auction 2018 Day 2 : Funds Spent/Remaining
రెండో రోజు వేలంలో భాగంగా మార్నింగ్ సెషన్ ముగిసింది. ఆదివారం జరిగిన వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా జయదేవ్ ఉనదఖ్త్ చరిత్ర సృష్టించాడు. జయదేవ్ ఉనదఖ్త్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ. 11.5 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో వేలంలో అత్యధిక ధర పలికిన రెండో ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు.
ఈ ఏడాది వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు:
* జయదేవ్ ఉనదఖ్త్ - రూ. 11.5 కోట్లు (RR)
* కేఎల్ రాహుల్ - రూ. 11 crore (KXIP)
* మనీష్ పాండే - రూ. 11 crore (SRH)
ఐపీఎల్ 2018 వేలంలో రెండో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా జయదేవ్ ఉనదఖ్త్ నిలిచాడు. దేశవాళీ క్రికెట్‌లో జయదేవ్ ఉనదఖ్త్ కోసం చెన్నై, రాజస్థాన్ జట్లు తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరకు రూ. 11.5 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ జట్టు సొంతం చేసుకుంది. న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్‌లో అద్భుత ప్రదర్శన చేస్తోన్న శివమ్ మావిపై ఫ్రాంచైజీలు ఆసక్తిని కనబర్చాయి. మావి కోసం ముంబై, కోల్‌కతా జట్లు తీవ్రంగా పోటీ పడ్డాయి. అయితే చివరకు కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 3 కోట్లకు శివమ్ మావిని సొంతం చేసుకుంది.