Reports said that Ajith might team up with producer Boney Kapoor for a new project.
బోనికపూర్, శ్రీదేవి దంపతులకు కేవలం బాలీవుడ్ లో మాత్రమే కాదు.. అన్ని చిత్ర పరిశ్రమల్లో మంచి స్నేహితులు ఉన్నారు. అయితే అజిత్ విషయంలో శ్రీదేవికి ఓ కోరిక తీరకుండానే మిగిలిపోయినట్లు తెలుస్తోంది.
తమిళ హీరో అజిత్ కూడా శ్రీదేవి ఫ్యామిలీకి మంచి సన్నిహితుడు. శ్రీదేవి సెకండ్ ఇన్నింగ్స్ లో చేసిన ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రంలో అజిత్ గెస్ట్ రోల్ లో నటించాడు.
అజిత్ ని హీరోగా పెట్టి ఓ సినిమా నిర్మించాలని చాలా రోజుల క్రితమే బోనికపూర్, శ్రీదేవి అనుకున్నారట. కానీ అజిత్ బిజీగా ఉండడంతో కుదరలేదు. అంతలోనే శ్రీదేవి మరణించారు. కాగా శ్రీదేవి మరణం తరువాత ఈ చిత్రానికి తొలి అడుగు పడినట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
అజిత్ తో సినిమా చేయాలని బోనికపూర్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చర్చలు ప్రాధమిక దశలోనే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం గురించి పూర్తి వివరాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
బోనికపూర్ నిర్మాణంలో నటిస్తానని అజిత్ గతంలో శ్రీదేవి సమక్షంలో హామీ ఇచ్చాడట. కానీ ప్రాజెక్ట్ మొదలయ్యే సమయానికి శ్రీదేవి అనూహ్యంగా మృతి చెందారు. బోని కపూర్ ఫ్యామిలీతో ఉన్న సాన్నిహిత్యంతో సినిమా చేయడానికి అజిత్ అంగీకరించినట్లు తెలుస్తోంది.