Naga Chaitanya's Savyasachi Movie Release Postponed

Filmibeat Telugu 2018-05-05

Views 786

As we all know young hero Naga Chaitanya right after his marriage started shooting for his next titled 'Savyasachi.' Directed by Chandoo Mondeti the film is touted to be an action thriller. As per latest updates 'Savyasachi' will postponed.
#Savyasachi
#NagaChaitanya

''ప్రేమమ్'' లాంటి సూపర్ సక్సెస్ తరువాత అక్కినేని నాగచైతన్య, డైరెక్టర్ చందు మొండేటిల క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ''సవ్యసాచి''. నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. మాధవన్ ఈ సినిమాలో మెయిన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు మంచి స్పందన లభించింది.
హీరోయిన్ భూమిక ఈ సినిమాలో నాగ చైతన్య అక్క పాత్రలో కనిపించబోతోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో నిర్మాతలు వై.నవీన్, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. "బాహుబలి" తర్వాత కీరవాణి "సవ్యసాచి"కి సంగీతం సమకూర్చడం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని సమాచారం.
''సవ్యసాచి'' సినిమాను జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నామని నిర్మాతలు గతంలో వెల్లడించడం జరిగింది. తాజా సమాచారం మేరకు ''సవ్యసాచి'' వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. జులై లో సినిమా రిలీజ్ కావచ్చని అంటున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కబోతోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS