Naga Chaitanya Savyasachi rakes in Rs 10 crore even before release. Madhavan playing key role in this movie
#NagaChaitanya
#Savyasachi
అక్కినేని హీరో నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం సవ్యసాచి. కథా బలంతో, థ్రిల్లర్ అంశాలతో చిత్రాన్ని నడిపించగల దర్శకుడు చందు ముండేటి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సవ్యసాచి అనే టైటిల్ తోనే ఈ చిత్రం అందరిలో ఆసక్తి పెంచింది. నాగ చైతన్య సరసన ఈ చిత్రంలో హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. తిరుగులేని విజయాల్ని సొంతం చేసుకుంటున్న మైత్రి మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం విశేషం. తాజగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ కు సంబందించిన వార్త ట్రేడ్ విశ్లేషకులని సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.