KL Rahul was spotted leaving a Mumbai eatery with actress Niddhi Agerwal ... KL Rahul was recently spotted with Bollywood actor Nidhhi Agerwal.
#klrahul
#mumbai
#nidhhiagerwal
#kingsxipunjab
గత ఆదివారంతో ముగిసిన ఐపీఎల్ 2018 సీజన్‌లో కేఎల్ రాహుల్ తన బ్యాట్‌తో అభిమానులను అలరించాడు. ఈ సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన కేఎల్ రాహుల్ ఐపీఎల్‌లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీని నమోదు చేసిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత జరిగిన మ్యాచ్‌ల్లో కేఎల్ రాహుల్ అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ, అతడికి జట్టులోని సహచర ఆటగాళ్ల నుంచి సరైన మద్దతు లభించకపోవడంతో జట్టుని ప్లే ఆఫ్స్‌కు చేర్చలేకపోయాడు. ఐపీఎల్ ముగిసిన తర్వాత తనకు లభించిన సమయంలో కేఎల్ రాహుల్ ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నాడు.
తాజాగా బాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్‌తో కలిసి కేఎల్ రాహుల్ ముంబైలో విధుల్లో చక్కర్లు కొట్టాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతేకాదు వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే రూమర్లు సైతం వినిపిస్తున్నాయి. చివరగా వీరిద్దరూ బాంద్రాలో ఫోటోలకు చిక్కారు.
ఇదిలా ఉంటే దేశ వ్యాప్తంగా సోషల్ మీడియాలో 'మనం ఫిట్‌గా ఉండే ఇండియా ఫిట్‌గా ఉంటుంది' అనే ఛాలెంజ్ వైరల్ అవుతోంది. ఇందులో భాగంగా ఫిట్‌నెస్ ఛాలెంజ్ స్వీకరించడం, మరో ముగ్గురిని ఛాలెంజ్ చేయడం లాంటివి చేస్తున్నారు. తాజాగా హీరో నాగ చైతన్య ఈ ఫిట్‌నెస్ ఛాలెంజ్ తన తమ్ముడు అఖిల్ నుండి స్వీకరించడంతో పాటు సమంత, సుశాంత్, తను నటిస్తున్న సవ్యసాచి మూవీ హీరోయిన్ నిధి అగర్వాల్‌ను ఛాలెంజ్ చేశారు.