Portugal and Spain produced a classic match on Friday (June 15) that ended in a thrilling 3-3 draw at Sochi, Russia. It was an incredible match that saw three stunning goals - one each from Diego Costa, Cristiano Ronaldo and Nacho Fernandez. Here Mykhel looks at some key takeaways from the Group B match.
#fifaworldcup2018
ప్రపంచ వ్యాప్తంగా వరల్డ్ కప్ కోసం పోటీపడుతున్న ఆటగాళ్ల కంటే దాని కోసం ఎదురుచూసే వారి సంఖ్యే ఎక్కువగా ఉంది. అభిమానానికి హద్దేముంది. దక్షిణ భారతంలో గుళ్లు కట్టించేంత అభిమానం ఉంటే, కొన్ని చోట్ల విగ్రహాలు పెట్టే నేపథ్యం లేకపోలేదు. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఫుట్‌బాల్ ఆటగాళ్ల విగ్రహాలు పలుచోట్ల అవతారమెత్తాయి. అయితే ఆఫ్రికా ఖండంలోని మడేరియాలో ఉన్న ఎయిర్‌పోర్టులో ఉన్న విగ్రహంపై చర్చ తలెత్తింది. ఎందుకంటే వారు ఉంచింది రొనాల్డో విగ్రహమే అయినా దాని ఆకృతి రొనాల్డొను పోలి లేదు.
గతేడాది మడేరియా ఎయిర్‌పోర్టులో పోర్చుగల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డొ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 2016లో ఈ ఎయిర్ పోర్టు పేరును క్రిస్టియానో రొనాల్డో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌గాను మార్చారు.
గతేడాది రొనాల్డొ విగ్రహం పెట్టినప్పుడే చాలా మంది అది రొనాల్డొను పోలినట్లు లేదు. ఎఫ్-1 డ్రైవర్ డేవిడ్ కౌల్ట్‌హార్డ్‌లా ఉందని ఎంతో మంది నెటిజన్లు తమ అభిప్రాయం వెల్లడించారు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్న విమానాశ్రయ అధికారులు కొద్ది రోజుల క్రితం రొనాల్డొ విగ్రహాన్ని మార్చినట్లు తెలిపారు.
ఈ విషయాన్ని రొనాల్డొ సోదరుడు కూడా ధ్రువీకరించాడు. ఈ కొత్త విగ్రహానికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. రొనాల్డొ విగ్రహం బాగుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఫిఫా ప్రపంచకప్ టోర్నీ కోసం రొనాల్డొ రష్యాలో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. టోర్నీలో భాగంగా బుధవారం పోర్చుగల్.. మొరాకోను ఢీకొట్టనుంది.