Fast Bowler Parvinder Awana Retires From Forms Cricket

Oneindia Telugu 2018-07-19

Views 2

ఢిల్లీ పేస్ బౌలర్ పర్వీందర్ అవానా అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. టీమిండియా తరఫున రెండు టి20 మ్యాచ్‌లు ఆడిన పర్వీందర్‌ అవానా చివరిసారిగా 2016 నవంబర్‌లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడాడు.ఈ సందర్భంగా ట్విటర్‌లో "టీమిండియా, దేశవాళీ క్రికెట్లో ఢిల్లీ(డీడీసీఏ)కి ప్రాతినిధ్యం వహించడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. నా స్థానంలో యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చేందుకు ఇదే సరైన సమయం అని అనుకుంటున్నాను. నా నైపుణ్యాలను ప్రదర్శించేందుకు అవకాశం ఇచ్చి, ప్రోత్సహించిన డీడీసీఏ సెలక్టర్లకు, సీనియర్లకు కృతజ్ఞతలు చెబుతున్నాను. ఎల్లవేళలా నాకు మద్దతుగా నిలిచిన, క్రికెట్ జర్నీలో భాగమైన ప్రతిఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను" అని పేర్కొన్నాడు.

Share This Video


Download

  
Report form