ఇప్పటికే అంతర్జాతీయ ఫార్మాట్ టెస్టు క్రికెట్‌కు గుడ్ బై చెప్పేశాడు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ. సంవత్సరారంభంలో జరిగిన ఐపీఎల్‌లోనూ అద్భుతమైన ప్రదర్శన చేసి ప్రతిభ ముందు వయస్సు ఒక సంఖ్య మాత్రమే అనే స్థాయిలో ఆడి చూపించాడు. అలాంటిది ఇటీవలే మొదలైన ఇంగ్లాండ్ పర్యటనలో ఎంఎస్ ధోనీ అంతగా రాణించలేకపోతున్నాడు. దీంతో అతనిపై సర్వత్రా విమర్శలు నెలకొన్నాయి.
దీంతో అతను ఇక విరమణ చేస్తే బాగుంటుందని కొందరు.. విరమణ ప్రకటించేశాడని కొందరు రూమర్లు పుట్టిస్తున్నారు. కానీ, అతను కెప్టెన్సీకే ఇంకా రాజీనామా చేయలేదని బీసీసీఐ టీవీ వెబ్‌సైట్ చెప్పుకొస్తుంది.
The future MS Dhoni has been the hot topic of discussion in Indian sporting circles, a talk accentuated by his two below-par outings against England in the one-dayers at Leeds and Lord's.
#MSDhoni