Rajasthan Royals were cruising at one stage, needing 39 off 24 bolls with eight wickets in hand. But they lost seven wickets after that, and managed to score 170/9 in 20 overs. Kings XI Punjab won their season opener by 14 runs to register their first victory in Jaipur in six attemp
#IPL2019
#RajasthanRoyals
#KingsXIPunjab
#RavichandranAshwin
#klrahul
#ajinkyarahane
#chrisgyale
#cricket
రాజస్తాన్ రాయల్స్.. సొంతగడ్డపై తొలి మ్యాచ్‌ను ఓటమితో ప్రారంభించింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై 14 పరుగుల తేడాతో రాజస్తాన్ ఓడిపోయింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ఓపెనర్ గేల్ (47 బంతుల్లో 79; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించగా... సర్ఫరాజ్ ఖాన్ (29 బంతుల్లో 46 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) . గేల్ (79) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ఆ జట్టు మంచి స్కోరు నమోదు చేయగలిగింది. ఆతర్వాత 185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ 9 వికెట్ల నష్టానికి 170 పరుగులు మాత్రమే చేసి 14 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. చివరి వరకు అందరూ రాజస్థాన్ విజయంపైనే నమ్మకం పెట్టుకున్నప్పటికీ చివర్లో వరుసగా వికెట్ల పడడంతో పంజాబ్ విజయం లాంఛనమైంది. చివరి ఓవర్లో 21 పరుగులు అవసరం కాగా రాజస్థాన్ కేవలం 6 పరుగులు మాత్రమే చేసింది. రాజస్థాన్ జట్టులో జోస్ బట్లర్ (69: 10 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీతో రాణించాడు. అజింకా రహానె(27), సంజు శాంసన్(30), స్మిత్(20) పరుగులు చేశారు