భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్..శతృదేశం పాకిస్తాన్ చేతికి చిక్కడానికి మనదేశమే పరోక్షంగా కారణమైందా? యుద్ధ సైనికుడిగా పాకిస్తాన్ జవాన్ల చేతికి చిక్కిన అభినందన్.. వెంటనే విడుదల కావడం హర్షణీయమే అయినప్పటికీ.. ఆయన వారి చేతికి చిక్కడానికి మనదేశ వైమానిక దళ వైఫల్యమే కారణమా? అంటే అవుననే సమాధానమ వినిపిస్తోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా అత్యాధునిక యుద్ధ విమానాలను సమకూర్చుకుంటున్నప్పటికీ.. దీనికి అనుగుణంగా సాంకేతిక పరిజ్నానాన్ని అందిపుచ్చుకోలేపోవడం వల్లే అభినందన్.. పాకిస్తాన్ సైన్యం చేతికి దొరికారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలను చేస్తోంది కూడా వాయుసేన మాజీ ఉన్నతాధికారులే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
#AbinandanVarthaman
#WingCommander
#IndianAirForce
#IndependenceDay2019