After winning four of the 17 Lok Sabha seats in Telangana, and engineering defection among four of the six Telugu Desam Party Rajya Sabha members, the Bharatiya Janata Party is now shifting gears in Telangana and Andhra Pradesh, which together account for 42 Lok Sabha seats.
#BJP
#Telangana
#kcr
#trs
#congress
#revanthreddy
#ktr
#laxman
#kishanreddy
#modi
#amithshah
2019 లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత దేశ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయిందని చెప్పాలి. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని చాలామంది భావించప్పటికీ కమలనాధులు సొంతంగా దేశం మొత్తంలో 300 సీట్లుతో విజయడంక మోగిస్తుందని మాత్రం ఎవరూ ఊహించలేదు. తమకు కంచుకోటలుగా ఉన్న రాష్ట్రాలు మాత్రమే కాదు.. బలహీనంగా ఉన్న పశ్చిమ బెంగాల్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఈసారి బీజేపీ ఓట్ల శాతం గతంలో కన్నా గణనీయంగా పెరిగింది. ఇక ముఖ్యంగా తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికల్లో 10 శాతం నుంచి 20 శాతానికి.. తాజాగా జరిగిన ఎన్నికల్లో 19.45 శాతం ఓట్లను పెంచుకోవడం గమనార్హం.