భారత్ మార్కెట్లో అడుగుపెట్టనున్న నిస్సాన్ మాగ్నైట్ - ఫీచర్లు, స్పెసిఫికేషన్స్, వివరాలు

DriveSpark Telugu 2020-07-25

Views 122

జపనీస్ కార్ బ్రాండ్ నిస్సాన్ భారత మార్కెట్ కోసం ఓ సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీని అభివృద్ధి చేస్తోందని డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనాల్లో ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా, నిస్సాన్ ఇప్పుడు తమ బిఎస్ 6 కాన్సెప్ట్‌ను ఆవిష్కరించింది. 'నిస్సాన్ మాగ్నైట్' అనే పేరుతో పిలువబడే ఈ సరికొత్త సబ్-4 మీటర్ ఎస్‌యూవీ వచ్చే ఏడాది ప్రారంభంలో భారత మార్కెట్లో విడుదల కానుంది.

మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీపై నిస్సాన్ గత కొంతకాలంగా పని చేస్తోంది. వాస్తవానికి ఈ మోడల్ గ్లోబల్ ఆవిష్కరణ ఈ సంవత్సరం ప్రారంభంలో జరగాల్సి ఉంది. భారతదేశం వేదిక 2020 చివరి నాటికి ఇందులోని ప్రొడక్షన్ వెర్షన్ మార్కెట్లో విడుదల కావల్సి ఉంది. అయితే, ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారి మరియు లాక్‌డౌన్ కారణంగా ఈ మోడల్ విడుదల మరింత జాప్యం అయ్యింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS