కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనల్లో భారత యువ క్రికెటర్ మన్‌దీప్ సింగ్ పాల్గొన్నాడు. వారు చేస్తున్న పోరాటానికి మద్దతు తెలిపాడు. తన సోదరుడు హర్వీందర్ సింగ్, మరో ముగ్గురు స్నేహితులతో కలిసి గత సోమవారం సాయంత్రం సింఘు సరిహద్దుకు వెళ్లిన మన్‌దీప్.. మంగళవారం సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు. అన్నదాతలతో పాటు రోడ్డుపై బైఠాయించి నిరసనలో పాల్గొన్నాడు.
#MandeepSingh
#Kxip
#KingsxiPunjab
#Ipl
#Teamindia
#Farmbills
#Farmers
#Agriculturebills
#Delhi
#Punjab